కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా..?

కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా..?

కరివేపాకే కదా అని కంచంలోంచి తీసి పక్కనపెడతారు చాలామంది. కానీ, దానిలో ఉండే పోషకాలు తెలిస్తే మాత్రం తినకుండా ఉండలేరు. కరివేపాకు పొడి, పచ్చడి మాత్రమే కాదు కూరలో తాలింపుగా ఉన్నా మేలే చేస్తుంది. అందులో ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి, ఇ విటమిన్లతో పాటు క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి మినరల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరోజూ దీన్ని తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కంటి చూపు, కిడ్నీల పనితీరును మెరుగు పరుస్తుంది. లివర్‌‌, గుండెజబ్బుల నుంచి కాపాడుతుంది. జుట్టు రాలకుండా అరికట్టాలన్నా, ఒబెసిటి నుంచి బయట పడేయాలన్నా కరివేపాకు బెస్ట్ మెడిసిన్. కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు యూరిన్, బ్లాడర్ సమస్యలను నివారిస్తాయి. కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్‌లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగితే యూరినరీ సమస్యలు కంట్రోల్ అవుతాయి. అలాగే, రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండాలన్నా, మార్నింగ్ సిక్​నెస్​ తగ్గాలన్నా కరివేపాకు తినాలి.

 

ఇవి కూడా చదవండి

జీఎస్టీ రిటర్నుల దాఖలు‌ గడువు పొడిగింపు

అగ్గువ వడ్డీకే హోమ్‌ లోన్స్‌

ఆరు నగరాల్లోనే ఐపీఎల్‌-14.. హైదరాబాద్‌కు దక్కని భాగ్యం

మహిళా దినోత్సవం కోరిక ఆమెదే