హెల్దీ డ్రింక్ అని గ్రీన్ టీ తాగుతున్నారా..?

హెల్దీ డ్రింక్ అని గ్రీన్ టీ తాగుతున్నారా..?

గ్రీన్ టీ తాగడానికి ఓ లెక్కుంది
బరువు తగ్గాలని గ్రీన్​ టీ  తెగ తాగేస్తుంటారు కొందరు. కానీ మోతాదు మించితే ఈ హెల్దీ డ్రింక్ లేనిపోని తిప్పలు తెచ్చిపెడుతుంది. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు గ్రీన్​ టీ తాగినా  సమస్యే. 
గ్రీన్​ టీలో కెఫిన్​ ఉండదనుకుంటారు చాలామంది. కానీ,  230 మిల్లీగ్రాముల ​ గ్రీన్​ టీలో  20 నుంచి 45 మిల్లీ గ్రాములు మాత్రమే కెఫిన్​ ఉంటుంది. కాఫీ, టీ లలో కూడా ఇంచుమించు ఇంతే కెఫిన్​ ఉంటుంది. హెల్దీ డ్రింక్​ అనుకుంటూ రోజుకి  ఐదారు కప్పుల గ్రీన్​ టీ తాగితే పెద్ద  మొత్తంలో కెఫిన్​ బాడీలో చేరి, లివర్​ డ్యామేజ్​ అయ్యే ప్రమాదం ఉంది. కెఫిన్ కారణంగా తలనొప్పి, నిద్ర  లేమి, వాంతులు, సమస్యలొస్తాయి. అలాగే గ్రీన్​ టీలో ఉండే ట్యానిన్​ వల్ల ఐరన్​​ సమస్యలు కూడా వస్తాయి. అందుకే రోజుకి రెండు కప్పులకి మించి గ్రీన్​ టీ తాగొద్దు.  అంతకన్నా ఎక్కువసార్లు తాగాల్సి వస్తే ఒక్కటే టీ బ్యాగ్​ని రెండుసార్లు ఉపయోగించాలి. 
తాగడానికో టైం
చాలామంది పరగడుపున గ్రీన్​ టీ తాగుతుంటారు. కానీ, ఖాళీ కడుపుతో గ్రీన్​ టీ తాగితే  ఎసిడిటి, లివర్​ సమస్యలు  వస్తాయి. అందుకే పొద్దుపొద్దునే గ్రీన్​ టీ తాగొద్దు. అలాగే  భోజనం చేసిన వెంటనే గ్రీన్​ టీ తాగుతారు ఇంకొందరు. దీనివల్ల  తిన్న  తిండిలో ఉన్న పోషకాలు శరీరానికి సరిగా అందవు. మనం తినే వాటిలో ఉండే పోషకాలను శరీరం గ్రహించకుండా గ్రీన్​టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు అడ్డుకుంటాయి. దీనికి తోడు జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే భోజనానికి ముందు గాని ఆ తర్వాత గాని గ్రీన్​ టీ తాగకూడదు.