ఆఫీస్ కి ఈ స్నాక్స్ తీసుకెళ్లండి.. కడుపు నిండుతుంది, హెల్దీ కూడా..

ఆఫీస్ కి ఈ స్నాక్స్ తీసుకెళ్లండి.. కడుపు నిండుతుంది, హెల్దీ కూడా..

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిని ఆఫీసుకు వెళ్తారు. ఆఫీస్ కు వచ్చిన గంటా, గంటన్నర తరువాత అంటే... పదకొండున్నర పన్నెండు. మధ్య ఆకలి మొదలవుతుంది. కానీ లంచ్ బాక్స్ తెరిచి తినే పరిస్థితి కాదు. అందుకని ఆ టైంలో వేగించిన స్నాక్స్ చిరుతిళ్ల వంటివి తింటారు. ఆరోగ్యం పాడుచేసుకుంటారు. వాటికి బదులు పోషకాలతో నిండిన ఆహారం తింటే కడుపు నిండుతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. అలాంటి కొన్ని స్నాక్స్ మీకోసం...

నట్స్- బెర్రీస్

ఎక్కువ కెలొరీలు, తక్కువ చక్కెర ఉన్న నట్స్, బెర్రీస్ ఆకలి తీర్చడమే కాకుండా గుండెకు ఎంతో మేలు చేస్తాయి. పిస్తా.. వాల్నట్స్, జీడిపప్పు, బాదంలలో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తో పాటు పీచు కూడా పుష్కలంగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, భాబెర్రీ, కాన్బెర్రీలలో మినరల్స్ మెండుగా ఉంటాయి. అందుకని నట్స్, బెరీన్తో పాటు ఇవి కూడా కలిపి తింటే బోలెడన్ని పోషకాలు. నట్స్, ఏర్రీస్ తింటే ఆకలి తీరుతుంది. ఆరోగ్యం సొంతమవుతుంది.

మొలకెత్తిన గింజల చాట్

మొలకెత్తిన గింజలు, టొమాటో, ఉల్లి, కీరదోసకాయ ముక్కలతో చాట్ చేయడం ఎంతో సులభం. వీటిపైన కొంచెం నిమ్మరసం, చాట్ మసాలా వేయాలి. ఈ చాటి మధ్యాహ్నం స్నాగా బాగా పనికొస్తుంది.

టొమాటో ఒరుగు

మామూలు టొమాటోటో కంటే ఎండబెట్టిన టొమాటోలో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై వాతావరణ మార్పుల తాలూకా ప్రభావం పడకుండా కాపాడుతుంది. ఎండబెట్టిన టొమాటోలు స్నాథ్ గా తింటే ఆకలి మీ

పల్లీలు

డైటరీ ప్రొటీస్ కు మంచి సోర్స్ పబ్లీగింజలు. పీచు పదార్థం, నాణ్యమైన కొవ్వు, ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వేగించి అలానే తినొచ్చు. లేదా మరింత రుచి కావాలంటే మసాలాలు కలుపుకుని కావచ్చు.

ఎండు కొబ్బరి

ఇది రుచిగా ఉండటమే కాకుండా తినగానే పొట్ట నిండుగా అనిపిస్తుంది. కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. జీవక్రియలు పెరుగుతాయి. బరువు తగ్గించడంలో కీలక పాత్ర. జ్ఞాపకశక్తి సమస్య ఉన్న వాళ్లు ఎండు కొబ్బరి తింటే మెదడు. చురుకుగా పనిచేస్తుంది. తినమన్నారు కదాని ప్యాకేజ్ ఫుడ్ తినొద్దు. ఎండబెట్టిన కొబ్బరి మాత్రమే తినాలి?

ఎనర్జీ బార్ 

తక్కువ కెలోరీలు, ఎక్కువ పీచు, ప్రొటీన్ పుష్కలంగా ఉన్న ఎనర్జీ బార్స్ ఆఫీ స్నాక్ గా పనికొస్తాయి. ఈ స్నాక్ కూడా బాదం, జీడిపప్పులు, క్రాస్ బెర్రీస్, కర్జూర, తేనె, బ్రౌస్ షుగర్, ఓటీ తో తయారైనవయితే మరింత ఆరోగ్యకరం.

మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్

ద్రాక్ష, బెర్రీ, కివి, యాపిల్, కీరదోసకాయ, బొప్పాయి, దానిమ్మ గింజలు, అరటిపండు ముక్కలు కలిపి మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ తయారుచేయొచ్చు. రుచికరమైన స్నాక్ గానే ఉపయోగపడుతుంది. సహజసిద్ధంగా మినరల్స్, విటమిన్స్ కూడా అందుతాయి.

కోడిగుడ్ల చాట్

ఆఫీసులో ఆకలికి ఈ చాట్ సూపర్ గా పనిచేస్తుంది. లేదంటే కప్పుటీతో పాటు కూడా తినొచ్చు. ఇలా చేయడం వల్ల కెలొరీలు పెరగకుండా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. అంతేకాదు డబ్బాలో తీసుకెళ్లడం కూడా చాలా తేలిక. ఉడికించిన గుడ్లను అలానే తినొచ్చు. లేదా ఉప్పు, కారం, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని లాగించొచ్చు.

వెజిటబుల్- పనీర్ శాండ్విచ్

ఇందులో బోలెడన్ని మినరల్స్, క్యాల్షియం, విటమిన్స్ ఉంటాయి. పనీర్. కాయగూరల ముక్కలు పెట్టి లాండ్ విచ్ చేసుకోవడం కూడా చాలా సులభం. అయితే బ్రౌన్ బ్రెడ్ అయితే మరింత ఆరోగ్యం.