ఈ డైట్ ప్లాన్‌​లతో ఆరోగ్యానికి  ముప్పే

ఈ డైట్ ప్లాన్‌​లతో ఆరోగ్యానికి  ముప్పే

హెల్దీగా ఉండాలి.. ఫిట్​గా కనిపించాలని  రకరకాల డైట్​లు ఫాలో అవుతుంటారు చాలామంది.  ఆ డైట్​ లిస్ట్​లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది  ​​కీటో డైట్​. దీన్నే కీటోజెనిక్​ డైట్​ అని కూడా పిలుస్తారు.  అయితే ఈ కీటో డైట్​ ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఎక్స్​పర్ట్స్​. మరికొన్ని  డైట్​లకి కూడా దూరంగా ఉండమని చెప్తున్నారు.  ఎందుకంటే.. కీటో డైట్​లో కార్బో హైడ్రేట్స్ తక్కువగా,  ఫ్యాట్స్​ ​ ఎక్కువగా ఉంటాయి.  ఈ డైట్​ ఫాలో అవ్వడం వల్ల శరీరానికి సరిపడా కార్బోహైడ్రేట్స్​ అందక బాడీ కీటోసిస్​ స్టేజ్​​లోకి వెళ్లిపోతుంది. ఫలితంగా బాడీలోని ఫ్యాట్​ అంతా కరిగి బరువు తగ్గుతారు. కానీ, ఫ్యాట్​ ఎక్కువ మొత్తంలో నెలలు తరబడి తీసుకోవడం వల్ల కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా కిడ్నీ సమస్యలొస్తాయి. బాడీలో కొలెస్ట్రాల్​ లెవల్స్​ కూడా పెరుగుతాయి. అందువల్ల  ఎక్కువ రోజులు కీటో డైట్​ చేయడం మంచిది కాదు. పైగా కీటో డైట్ మానేశాక  శరీరానికి సరిపడా కార్బోహైడ్రేట్స్​ అందితే మళ్లీ బరువు పెరుగుతారు. కేవలం ఈ ఒక్క  డైటే కాదు జిఎమ్​, మాస్టర్​ క్లీన్స్​ డైట్​లు కూడా  ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి.  జిఎమ్​ డైట్​లో ఏడురోజుల పాటు ధాన్యాలు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్​​ ఫుడ్​, రిఫైండ్​ షుగర్, సీ ఫుడ్​కి దూరంగా ఉండాలి. ఫలితంగా వారానికి కిలో చొప్పున తగ్గుతారు. కానీ, వారం రోజుల పాటు బాడీకి  ప్రొటీన్లు, విటమిన్లు అందక చాలా సమస్యలొస్తాయి. మాస్టర్​ క్లీన్స్​ డైట్​లో  రోజంతా నిమ్మరసం తాగుతుండాలి. దీనివల్ల బాడీలో డిటాక్సిఫికేషన్​ జరిగి  బరువు తగ్గుతారు. అంతేకాదు  హానికర టాక్సిక్స్​ కూడా బాడీ నుంచి బయటికి వెళ్తాయి.  కానీ, రోజంతా నిమ్మరసం తాగడం వల్ల తలనొప్పి,  అలసట, చిరాకు, మలబద్ధకం సమస్యలొస్తాయి.  అందువల్ల ఈ డైట్​కి దూరంగా ఉండటం మంచిది. అలాగే  న్యూట్రిషనిస్ట్​ ​ సలహా మీదే ఏ డైట్​ అయినా ఫాలో అవ్వాలి.