చంద్రబాబు  బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా..

చంద్రబాబు  బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ మళ్లీ వాయిదా పడింది.  స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై.. 2023, అక్టోబర్ 12వ తేదీ గురువారం ఉదయం.. విజయవాడలోని ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు తరపు లాయర్లు వాదించగా.. విచారణ కీలక దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇస్తే.. సాక్ష్యులపై ప్రభావం చూపించే అవకాశం ఉందని.. విచారణ ముగిసే వరకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరపు లాయర్లు వాదించారు.

బెయిల్ పిటీషన్ పై గంటపాటు వాదనలు కొనసాగాయి. రెండు వర్గాల వాదనలు ముగిసిన తర్వాత.. బెయిల్ పిటీషన్ పై విచారణను వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. సీఐడీ వాదనతో ఏకీభవించింది న్యాయస్థానం. దీంతో చంద్రబాబు రాజమండ్రి జైలులోనే మరికొన్ని రోజులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 

చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణ.. అక్టోబర్ 17వ తేదీ.. మరోసారి బెంచ్ మీదకు రానుంది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది హైకోర్టు. 370 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో  సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.