కుర్రోళ్ల గుండెలకు ఏమైందీ.. పది రోజుల్లో ఏడుగురు

కుర్రోళ్ల గుండెలకు ఏమైందీ.. పది రోజుల్లో ఏడుగురు

తెలంగాణలో పది రోజుల్లో ఏడుగురు కుర్రోళ్లు.. అందరూ 30 ఏళ్ల లోపు వాళ్లే.. ఫిట్ గా ఉన్నోళ్లు.. తాగుడు లేదు.. సిగరెట్లు లేవు..అందరూ కుర్రోళ్లు.. దమ్ముంటే గుండెలపై కట్టురా అన్నంత ధీమాగా ఉండాల్సినోళ్ల గుండెలు.. టప్ టప్  అని ఆగిపోతున్నాయి. నడుస్తూ ఒకరు చనిపోతే.. జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తూ మరొకరు.. డ్యాన్స్ చేస్తూ ఒకరు.. కాలేజీలో నడుస్తూ మరొకరు.. ఇలా తెలంగాణలో పది రోజుల్లోనే ఏడుగురు కుర్రోళ్లు గుండెపోటుతో చనిపోయారు. గుండెపోటుకు గతంలో లేవా.. ఇప్పుడే కొత్తగా వచ్చాయా అంటే బిన్నవాదనలు వినిపిస్తున్నాయి.. గతంలోనూ ఉన్నాయి కాకపోతే 40 ఏళ్లు. 50 ఏళ్ల తర్వాత ఎక్కువగా ఉండేవి.. ఇప్పుడు అలా లేకపోవటమే ఆందోళనకు గురి చేస్తుంది. 

18 ఏళ్ల కుర్రోడికి గుండెపోటు ఏంటీ.. ఎలాంటి అలవాట్లు లేని.. ఫిట్ ఉన్న  25 ఏళ్ల కానిస్టేబుల్ జిమ్ చేస్తూ కుప్పకూలి చనిపోవటం ఏంటీ.. 19 ఏళ్ల కుర్రోడు చలాకీగా డాన్స్ చేస్తూ గుండెనొప్పితో మరణించటం ఏంటీ.. ఇలాంటివే ఇప్పుడు అందర్నీ కలతకు గురి చేస్తున్నాయి. ఈ కుర్రోళ్లకు ఏమైందీ.. గట్టిగా ఉండాల్సిన గుండెలు.. సడెన్ గా ఆగిపోవటం ఏంటీ.. తెలంగాణలో వరసగా జరుగుతున్న పరిణామాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గుండెపోటు మరణాలు గతంలోనూ ఉన్నాయి.. కాకపోతే పెద్ద వయస్సు వారిలో ఉండేవి.. ఇప్పుడు అది 30 ఏళ్లలోపుకు రావటమే అంతుచిక్కటం లేదు.. 

టెన్షన్స్.. ఒత్తిడి.. మానసిక సంఘర్షణలు ఇలాంటి కారణాలతో గుండెపోటు వస్తుంటాయని చెబుతున్నారు డాక్టర్లు. ఇది నిజమే కావచ్చు  కానీ.. గుండె ఆగిపోయేంత టెన్షన్ తో వాళ్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా అనేది ఇప్పుడు ప్రశ్న. పది రోజుల్లో ఏడుగురు కుర్రోళ్లు.. అందులోనూ 30 ఏళ్లలోపు వాళ్లు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోవటం అనేది తీవ్రంగా ఆలోచించాల్సిన అంశమే.. యువతను అలర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వస్తుంది.. ఎలా వస్తుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ.. అనే విషయాలపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది...