ఉమ్మడి నల్గొండలో హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచిన పీకే సర్వే

ఉమ్మడి నల్గొండలో హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచిన పీకే సర్వే
  • అందరి అస్త్రం అదే..
  • ఉమ్మడి నల్గొండలో హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచిన పీకే సర్వే
  • సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్న పోస్టింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •  నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రచ్చకెక్కిన విబేధాలు
  •  నల్గొండ, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచిన  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీకే సర్వే అధికార, ప్రతిపక్షాలకు బలమైన అస్త్రంగా మారింది. సర్వే విషయాలు బయటకు రానప్పటికీ జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యేల గ్రాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడిపోయిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సర్వే రిపోర్టులు ఎమ్మెల్యేలను ఆందోళనకు గురిచేస్తుండగా... దీన్నే అదునుగా భావించిన అధికార, ప్రతిపక్ష లీడర్లు నియోజకవర్గాల్లో దూకుడు పెంచారు. నల్గొండ, నాగార్జున సాగర్, నకిరేకల్, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఇరు పక్షాల మధ్య పెద్ద వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడుస్తోంది. ముఖ్యంగా నకిరేకల్, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్గొండ నియోజకవర్గాల్లోని లీడర్లు ఒకరిపై మరొకరు ఎదురుదాడికి దిగుతున్నారు. సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా వేదికగా తమ బలాన్ని చాటుకునేందుకు కార్యకర్తలు, అభిమానులతో పోటాపోటీగా సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీడియాలో పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెట్టిస్తున్నారు.

నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రచ్చకెక్కిన విబేధాలు

నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య ఉన్న విబేధాలు రచ్చకెక్కాయి. పీకే సర్వే తనకే అనుకూలంగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరేశం దూకుడు పెంచారు. నియోజకవర్గంలో తన బలాన్ని చాటుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని బలప్రదర్శన చేస్తున్నారు. నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డే వేడుకలను ఎంతో ఆర్భాటంగా చేసిన వీరేశం... మూడు రోజుల క్రితం విశ్వగురు స్వచ్చందసంస్థ తనకు ప్రకటించిన అవార్డు ఫంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు జనం భారీగా తరలిరావడంతో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాజకీయ వేడి రాజుకుంది. మరోవైపు సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో చిరుమర్తి, వీరేశంలపైన వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్న పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సంచలనం రేకెత్తిస్తున్నాయి. మంగళవారం మంగళపల్లిలో జరిగిన ఓ ప్రోగాంలో వీరేశంపైన ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు మరింత అగ్గిరాజేశాయి. ‘వీరేశానికి పార్టీలో సభ్యత్వమే లేదని, అతడిది భూకబ్జాలకు పాల్పడే వ్యక్తిత్వం’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరేశం వర్గీయులు బుధవారం ఎమ్మెల్యేపైన సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో దుమ్మెత్తి పోశారు. ‘పార్టీ ప్లీనరీకి హాజరైన వీరేశానికి సభ్యత్వం లేదని ఎట్లా అంటవ్.. కాంగ్రెస్​ నుంచి వచ్చిన నీకు పార్టీలో చోటు లేదని’ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయి.

అక్కడ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌... ఇక్కడ కోమటిరెడ్డి

కోదాడ, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్గొండ ఎమ్మెల్యేలపైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగినట్లు సర్వే రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోదాడ కేంద్రంగానే పర్యటిస్తున్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 138 గ్రామాల్లో పర్యటన పూర్తి చేసిన ఆయన, కోదాడలో 16 గ్రామాల్లో తిరిగారు. నియోజవర్గంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అందుకు ఎమ్మెల్యే వైఖరే కారణమని ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపిస్తున్నారు. అయితే సర్వే రిపోర్టులు అనుకూలంగా లేవని వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యేలు సైతం పక్కా ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్నారు.  నియోజకవర్గంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులపైన ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టిన వారు, వీలైనంత వరకు పనులు కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటన కూడా ఉండొచ్చని తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డినే లక్ష్యంగా చేసుకుని పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అవినీతిపైన  మండిపడుతున్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అసంతృప్తులు ఇప్పటికే చాలా మంది కోమటిరెడ్డితో టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.

దీన్ని మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే మండలాలు, గ్రామాల వారీగా మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎమ్మెల్యే భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి మాత్రం అభివృద్ధి, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకపైనే నమ్మకం పెట్టుకున్నారు. నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డిల  మధ్య జరుగుతున్న గొడవల వల్ల నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలి పోయింది. మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటన తర్వాత కూడా అక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితులే సర్వే రిపోర్టులను స్పష్టం చేస్తున్నాయని పార్టీ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకుడొకరు చెప్పారు. సర్వే నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని ఎమ్మెల్యేల పనితీరును బట్టి ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం మారుతుందని ఆయన చెప్పారు.