రోజురోజుకు పెరిగిపోతున్న ఎండల తీవ్రత

రోజురోజుకు పెరిగిపోతున్న ఎండల తీవ్రత


హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఉదయం 8 గంటలకే భానుడు భగ్గుమంటుండగా.. సాయంత్రం ఆరైనా టెంపరేచర్లు తగ్గడం లేదు. రాష్ట్రంలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల దాకా టెంపరేచర్లు అధికంగా నమోదవుతుండటంతో పాటు వడగాడ్పులు కూడా వీస్తున్నాయి. ఆదివారం పెద్దపల్లి జిల్లా మంథనిలో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.

జగిత్యాలలోని ఎండపల్లిలో 45.7, ఖమ్మంలోని పమ్మి, జయశంకర్‌‌ భూపాలపల్లిలోని చెల్పూరు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌లోని కెరమెరిలో 45.6 డిగ్రీల చొప్పున, నల్గొండలోని దామరచర్ల, ఆదిలాబాద్‌‌లోని జైనద్‌‌, జనగామలోని వడ్లకొండలో 45.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలోని పలు చోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో పలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురవచ్చని చెప్పింది.

 

ఇవి కూడా చదవండి

ఫోర్త్ వేవ్ భయంతో మూడో డోసు వేయించుకుంటున్న జనం

వచ్చే ఏడాది నుంచి పల్లె విద్యార్థులకు ఇంటి వద్దకే వర్సిటీలు

మన రక్తంలో మైక్రో ప్లాస్టిక్‌‌!

దరఖాస్తులు క్లియరైనా నిధులు విడుదల​ చేస్తలె