బాబోయ్ ఎండలు.. మార్చిలోనే రికార్డులు బద్దలుకొడుతోంది..!

బాబోయ్ ఎండలు.. మార్చిలోనే రికార్డులు బద్దలుకొడుతోంది..!

బాబోయ్ ఎండలు మండిపోతున్నాయి..మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం (మార్చి 8) పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. ఏపీలో పశ్చిమ , దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లోను, పశ్చిమ తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

ఎల్ నినో ప్రభావంతో ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. మార్చి నుంచి మే వరకు మూడు నెలలు దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే  ఎక్కువగా నమోదు అవుతాయని హెచ్చస్తోంది. ముఖ్యంగా వేడి గాలులు వీస్తాయని తెలిపింది. అంటే మార్చి నుంచి మే వరకు వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది గతేడాది ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. 

మార్చి నుంచి మే వరకు జమ్మూకాశ్మీర్, తమిళనాడు మినహా అన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ సూచించింది. ఈ మూడు నెల్లలో తీవ్రమైన వేడి గాలులతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రభావం దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుందని  వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఎన్ నినో గురించి.. 

ఎల్ నినో గతేడాది (2023) జూలై నుంచి దీని ప్రభావం కొనసాగుతోంది.  ఎల్ నినో కారణంగా వర్షాకాలంలో కరువు వచ్చింది. 2023 ఆగస్టు లో వందేళ్లలో ఎప్పుడూ చూడని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఆగస్టులో వర్షాలు భారీగా కురుస్తాయి. కానీ గతేడాది ఆగస్టులో వర్షం అనే మాటే వినపడలేదు. తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా దేశంలో సాధారణ వర్షపాతం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదు అయింది. ఎల్ నినో ప్రభావంతో 2024 జనవరి లో కూడా వర్షాల పడలేదు. కానీ శీతాకాలంలో మాత్రం దేశంలోని  పలు రాష్ట్రాలు చలితో వణిపోయాయి.జనవరిలో చలి పాత రికార్డులను బద్దలు కొట్టింది. 

ALSO READ :- శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి... లక్షల మందితో కిటకిట

ఎల్ నినో ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని పలు దేశాల్లో అత్యవసర పరిస్థితి నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ సంస్థలు ఎల్ నినో ను పర్యవేక్షిస్తున్నాయి. అయితే 2024 ఏప్రిల్ నాటికి ఎల్ నినో ప్రభావం ముగియందని అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది.