బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ వైపు తుపాన్

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ వైపు తుపాన్

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీంతో ఏపీకి తుపాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని..ఇది క్రమేపీ బలపడి ఈనెల 20వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 

అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దిశగా పయనించనుందని అంచనా వేశారు.  దీంతో తుఫానుగా, పెను తుఫానుగా మారే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం తుఫాన్ గా మారితే సిత్రాంగ్ అనే  పేరుతో పిలవనున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సిత్రాంగ్ సూపర్ సైక్లోన్ గా మారితే దీని ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై అధికంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.