వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తుల సందడి

వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తుల సందడి

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైనా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు తెల్లవారుజామున నుంచి స్వామి దర్శనానికి క్యూ కట్టారు.

 భీమన్న ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. 3500 మంది భక్తులు కోడె మొక్కులను చెల్లించుకున్నారు. అభిషేకాలు, నిత్య కళ్యాణం పూజలు చేశారు. సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండగా ప్రచారం రథంలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.