సింగూర్ ప్రాజెక్టుకు భారీగా వరద

సింగూర్ ప్రాజెక్టుకు భారీగా వరద

పుల్కల్, వెలుగు: సింగూర్ ప్రాజెక్టులోకి  భారీగా వరద వస్తోంది. ఇరిగేషన్ అధికారులు 6, 9, 10, 11వ నంబర్​గేట్లను రెండు మీటర్లు ఎత్తి 37,685 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.117 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.103 టీఎంసీలకు చేరింది.  నదీ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ డీఈఈ నాగరాజు, జేఈ మహిపాల్ రెడ్డి సూచించారు.