
గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్‌కు క్రమంగా వరద పెరుగుతోంది. ఎగువ నుంచి 1.50 లక్షల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 14 గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా94,878 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,342, బీమా లిఫ్ట్-1కు 650, కోయిల్ సాగర్ లిఫ్ట్‌కు 315, లెఫ్ట్ కెనాల్‌కు 550,రైట్ కెనాల్‌కు 290, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, బీమా లిఫ్ట్ 2కు 750, సమాంతర కాల్వకు 750 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,26,819 క్యూసెక్కుల నీటిని జూరాల నుంచి దిగువకు వదులుతున్నారు.