కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక
  • ప్రజలకు అలర్ట్​గా ఉండాలని కలెక్టర్ సూచన  

కామారెడ్డి, వెలుగు: జిల్లాలో సెప్టెంబర్ 2 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అలర్ట్​గా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదివారం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.