రాష్ట్రంలో 2 రోజుల పాటు మోస్తరు వానలు

రాష్ట్రంలో 2 రోజుల పాటు మోస్తరు వానలు

రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్లొండ, సూర్యాపేట జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని సూచించింది.

ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం బలహీన పడింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్ లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.