
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కొమ్మెర గ్రామంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. పర్వతాయపల్లి రోడ్డులో గల కుమ్మరి వీధిలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. బాధితులు కంటతడి పెట్టారు. తమను ఆదుకోవాలని కోరారు.
జడ్చర్ల వెలుగు: జడ్చర్ల పట్టణంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లు చెరువులను తలపించాయి. నేతాజీ చౌక్, శాంతినగర్, రాజీవ్ నగర్, నిమ్మబావిగడ్డ, పాత బజార్, బాదేపల్లి, చైతన్యనగర్, నల్లకుంట తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెంకటరమణ థియేటర్ సమీపంలో ప్రధాన రోడ్లు నీటమునిగి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
నల్లకుంట ఎఫ్ టీఎల్ ను మట్టితో నింపడమే ఈ సమస్యకు కారణమని స్థానికులు ఆరోపించారు. కలెక్టర్ స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరారు. జడ్చర్ల మండలం గైరాన్తండాలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి స్వప్న–చరణ్దంపతుల ఇల్లు కూలిపోయింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.