ఢిల్లీలో భారీ వర్షం..

ఢిల్లీలో భారీ వర్షం..

ఢిల్లీలో భారీ వర్షం పడుతుంది. గురువారం సాయంత్రం అకస్మత్తుగా వచ్చిన వర్షంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ప్రధాని నివాసంగల లోక్ కళ్యాణ్ మార్గ్ లో కూడా  నీళ్లు భారీగా చేరాయి. దీంతో పాటు మోతీ భాగ్ రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. వాహనదారులు ఇల్లకు చేరడానికి కష్టపడుతున్నారు.

ఇప్పటికే దేశంలో సాదారణ స్థాయికన్నా అధిక వర్షపాతం నమోదు అయిందని వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాల ధాటికి బీహార్, ఉత్తర ప్రదేశ్ ప్రజలు విలవిల లాడుతున్నారు. ఆయా రాష్ట్రాల నగరాలలో భారీగానీరు చేరాయి. ఉత్తర్ ప్రదేశ్ లో 80 మందికిపైగా మృతి చెందారు. అంటువ్యాదులు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.