
శుక్రవారం ( జులై 18 ) సాయంత్రం కురిసిన వర్షం హైదరాబాద్ ను ముంచేసింది.. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో వరదనీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. చాలా చోట్ల జనం ట్రాఫిక్ జామ్ తో నరకయాతన యాతన పడ్డారు. ఈ క్రమంలో సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది..గాలి దుమారంతో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు.
వర్షం ఏకాదటిగా కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి.. చాలా ప్రాంతాల్లో చెరువులను తలపించేలా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది... స్కూలు వదిలి పెట్టే సమయం కావడంతో ఒకసారిగా వచ్చిన వరదనీటి ఉధృతికి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.. సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సమీపంలో వరద నీరు మోకాళ్ళ లోతుకుపైగా చేరుకుంది. దీంతో విద్యార్థులను బయటికి రానివ్వలేదు స్కూల్ యాజమాన్యం. విద్యార్థులు తల్లిదండ్రులు, ఆటోడ్రైవర్లు విద్యార్థులను దగ్గరుండి తీసుకెళ్లారు... మోకాళ్ళ లోతు వరద నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు వర్ణాతీతంగా మారాయి.
ALSO READ : Hyderabad Rains: భారీ వర్షం ఎఫెక్ట్: ఇదేం ట్రాఫిక్ దేవుడా..! హైదరాబాద్లో ఈ రూట్లో మాత్రం వెళ్లకండయ్యా..!
బోయిన్పల్లి లోని సాయిబాబా కాలనీ, సీతారాంపురం, హర్షవర్ధన్ కాలనీ, రామ్ రెడ్డి కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ, సహా పలు కాలనీల్లో చెరువులను తలపించేలా భారీగా వరద నీరు చేరింది..భారీగా వస్తున్న వరద నీళ్లకు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పాదచారులు భయాందోళనకు గురికాగా.. ఇళ్లలోకి వెళ్లేందుకు కంటోన్మెంట్ సానిటరీ సిబ్బంది వారికీ సాయం చేస్తున్నారు.