హైదరాబాద్ లో కుండపోత వాన

హైదరాబాద్ లో కుండపోత వాన

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం పడుతోంది. చాలా ఏరియాల్లో గంట నుంచి వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మసబ్ ట్యాంక్, ఖైరతాబాద్ లో వర్షం కురుస్తోంది. మెహదీపట్నం, అసిఫ్ నగర్, మల్లేపల్లి, నాంపల్లి, రాజేంద్ర నగర్, ఫలక్ నూమాలో భారీ వర్షం పడుతోంది. ఎల్బీనగర్, బి.ఎన్.రెడ్డి,  హస్తినాపురం, చైతన్యపురి, దిల్ సుఖ్ నగర్, కర్మన్ ఘాట్, నాగోల్, హయత్ నగర్ లో అరగంట నుంచి ఆగకుండా వర్షం పడుతోంది. మూసాపేట్, కుకట్ పల్లి, చందానగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కార్వాన్,  రామచంద్రాపురం, అంబర్ పేట్ హెవీ రెయిన్ కురుస్తోంది.  శంషాబాద్ బస్టాండ్ లో భారీ వర్షం.. గాలివానకి ఆటో ట్రాలీ కొట్టుకుపోయింది. దీంతో ఒక కారు డ్యామేజ్ అయింది. హయత్ నగర్ లో 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. రాజేంద్రనగర్ లో 1.6, హస్తినాపురంలో 1.5, లింగోజిగూడ, బహదూర్ పుర లో 1.2, వనస్థలిపురం, మూసాపేట్ లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తల కోసం

షారుఖ్‌ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరణ

అఫైర్లు, అబార్షన్ రూమర్లపై సమంత రియాక్షన్

డ్రగ్‌ కేసులో తల్లి పుట్టిన రోజున జైలుకు ఆర్యన్‌ ఖాన్‌