ముంబైలో భారీ వర్షం..పలు ప్రాంతాలు జలమయం

ముంబైలో భారీ వర్షం..పలు ప్రాంతాలు జలమయం

మహారాష్ట్రలోని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. దీంతో పాటు రాబోయే 4-5 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(BMC) అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని BMC, పోలీసులు ట్వీట్‌ చేశారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లద్దని ఆదేశించారు.