
తగ్గినట్టే తగ్గి మళ్లీ ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం భారీగా కురుస్తున్న వర్షాలతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులను దారి మళ్లించారు. భారీవర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని, ప్రయాణికులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని స్పైస్ జెట్ ట్వీట్ చేసింది. సోమవారం ఉదయం ముంబైలోని పాల్ఘార్, థానే, రాయిగడ్, ప్రాంతాల్లో భారీవర్షాలు కురిశాయి. శివాజీ నగర్ లో ఇల్లు పైకప్పు కూలిన ఘటనలో 8 మంది గాయపడ్డారు. బాండ్రా, శాంతాక్రజ్, విలే పార్లే, బోరివలి ప్రాంతాల మధ్య వరదనీటి నిల్వతో ట్రాఫిక్ స్తంభించి పోయింది.