హిమాచల్ లో దంచికొడుతున్న వానలు

హిమాచల్ లో దంచికొడుతున్న వానలు

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వకంలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాబోయే నాలుగు రోజులు కూడా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని ఐఎండీ తెలిపింది. కొండ ప్రాంతాల్లో  కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాల కారణంగా 14 చోట్ల రహదారులు ధ్వంసం అయ్యాయి. 20 నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడింది. 10 ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయాయి. నరకందలో 13.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా..ఉనాలో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడటంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.