ఢిల్లీలో భారీ వర్షం

ఢిల్లీలో భారీ వర్షం
  • ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం
  • లోతట్టు ప్రాంతాలు జలమయం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణంలో మారిపోయింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం 11 గంటలకు కురిసిన భారీ వర్షానికి ఢిల్లీలోని చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఢిల్లీ, హిస్సార్‌‌, హన్సీ, భివానీ, జిండ్‌, మిహమ్‌, కైతాల్‌, గోహానా, గన్నౌర్‌‌, సోనీపట్‌, బాగ్‌పట్‌, మీరట్‌, మహీందర్‌‌ఘర్‌‌, కోసిలీ, ఫరూక్‌నగర్‌‌, షామిలీ, గురుగ్రామ్‌, పానీపట్‌, రోహ్‌తక్‌, జాజిర్‌‌, కర్నాల్‌, కురుక్షేత్రలో దాదాపు గంట పాటు వర్షం కురిసింది అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. హర్యానాలోని చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది.