సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటలో బుధవారం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు ఇండ్లపై కప్పులు గాలికి ఎగిరిపోయాయి. భారీ చెట్లు రోడ్లపై నెలకులాయి.
పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. .మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై రోడ్లపై కూలిన చెట్లు, వరద నీటిని తొలగించారు.