ఢిల్లీలో భారీ వర్షాలు

ఢిల్లీలో భారీ వర్షాలు

రుతుపవనాల కదలికతో దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ఇటు దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీ తడిసిముద్దవుతోంది. జనజీవనం స్థంభించిపోయింది. భారీ వానలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  విజయ్ చౌక్ పార్లమెంట్ భవనం, ఇండియా గేట్, ఐటీవో ఢిల్లీ మెట్రో స్టేషన్ తో పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.   రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది.  వానలతో ఈ ప్రాంతాలన్నీ నిర్మానుశ్యంగా మారిపోయాయి.