భారీ వర్షాలతో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ అతలాకుతలం..

భారీ వర్షాలతో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ అతలాకుతలం..

భారీ వర్షాల కారణంగా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ లలో వరదలు భీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లోని ఊళ్ళకు ఊళ్లే నీట మునిగాయి. రోడ్లు, ఇండ్లు, పంటల పొలాలు వరదల్లో కొట్టుకుపోయాయి.  జనజీవనం స్థంభించిపోయింది.  భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని గుజరాత్, తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్  రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. 

మహారాష్ట్రలోని భారీ వర్షాల కారణంగా నాందేడ్‌తో పాటు కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి.  నాందేడ్లో ఇద్దరు మృతిచెందాగా.. కొన్ని గ్రామాలలో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో వందల సంఖ్యలో నిరాశ్రయిలయ్యారు. సుమారు 6వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. 

మరోవైపు, కుండపోత వర్షాలు.. వరదల కారణంగా కర్ణాటకలో ఇప్పటివరకు మొత్తం 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడింది.  వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ  హెచ్చరించింది. 

గురువారం కురిసిన భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమైంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.  వాడాలాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. థానేలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. నాందేడ్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. 

ALSO READ :ముంపు ముప్పులో మంచిర్యాల.. కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో రాళ్లవాగుకు ఎగపోటు 

మరోవైపు తెలంగాణలోనూ భారీవర్షాలు  ముంచెతుత్తున్నాయి. వరంగల్‌లోని వరద బాధిత గ్రామంలో JCB పైన చిక్కుకుపోయిన ఆరుగురిని IAF హెలికాప్టర్ ద్వారా రక్షించారు. 

 

#WATCH | Maharashtra | Waterlogging witnessed in several parts of Wadala due to continuous heavy rainfall. pic.twitter.com/wxQ0cFZB1C

— ANI (@ANI) July 28, 2023

VIDEO | IAF helicopters were pressed into service earlier today to rescue six people who were stranded atop a JCB in a flood-hit village in Warangal, Telangana.

(Source: Third Party) pic.twitter.com/rcQhAHgfrn

— Press Trust of India (@PTI_News) July 27, 2023