
భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి/అశ్వారావుపేట, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పలు చోట్ల శనివారం రాత్రి, ఆదివారం భారీ వానలు పడ్డాయి. కొత్తగూడెం, ములకలపల్లి, అశ్వారావుపేట, మణుగూరు, అన్నపురెడ్డిపల్లి, బూర్గంపహాడ్, భద్రాచలం, ఆళ్లపల్లి, పినపాక, పాల్వచ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ములకలపల్లి, అశ్వారావుపేట మండలంలో కురిసిన భారీ వర్షంతో కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చలమన్న నగర్లో పిడుగు పడడంతో గుడిసె దగ్ధమైంది. పలు చోట్ల రోడ్డుకు అడ్డంగా చెట్లు విరగిపడ్డాయి. మణుగూరులో 3.7సెంటీమీటర్లు, అన్నపురెడ్డిపల్లి, చర్ల, పాల్వంచలో 2.9, కరకగూడెంలో 2.5, మణుగూరులో 2.3, ఆళ్లపల్లిలో 2.2, బూర్గంపహాడ్ లో 1.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.