దుబాయ్ లో దంచికొట్టిన వర్షం... చెరువులను తలపిస్తున్న రోడ్లు

దుబాయ్ లో దంచికొట్టిన వర్షం... చెరువులను తలపిస్తున్న రోడ్లు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ( నవంబర్ 18)  భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం దాటికి రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా ట్రాఫిక్, విమాన కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. దుబాయ్ నివాసితులు బీచ్‌లకు దూరంగా ఉండాలని.. రోడ్లపై వరదలు తగ్గాకే ఇంట్లోనుంచి బయటకు రావాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా పరిస్థితి విషమించడంతో దుబాయ్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తుఫాను, వర్షం కారణంగా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. యుఎఇ జాతీయ వాతావరణ కేంద్రం ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. దుబాయ్ లో నీట మునిగిన పలు దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇదిలా ఉంటే.. భారీ వరదల ధాటికి బిల్డింగ్ ల ముందు పార్కింగ్ చేసిన కార్లు మునిగిపోయాయి. అయితే ఈ వీడియోకు సంబంధించి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు రోడ్లపై నిలిచిన వర్షపు నీరును తరలించేందుకు దుబాయ్ మున్సిపాలిటీ అధికారులు శ్రమిస్తున్నారు