భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడుతున్న కొండ చరియలు

భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడుతున్న కొండ చరియలు

హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరుగుతుండడంతో రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. అసలే కొండ ప్రాంతాలు, అందులోనూ ట్రాఫిక్ ఎక్కువవుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండి జిల్లాలోని గోహర్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలను కొందరు రికార్డ్ చేశారు. నిజానికి ప్రమాదాన్ని పసిగట్టి రోడ్డుపై అందరినీ ఆపేయడంతో ప్రాణనష్టం తప్పింది.