హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం

  హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. పలుప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్ర్, ఫిలింనగర్, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ,  యూసఫ్ గూడ, బోరబండ,ఎస్సార్ నగర్, అమీర్ పేట, కూకట్ పల్లి, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహిదీపట్నం, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్,  బీఎన్ రెడ్డి, హయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. 

మరో నాలుగు రోజులు వర్షాలుంటాయని వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. 

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ పడే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. 

ఇక ఆదిలాబాద్, జగిత్యాల,కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. 

సెప్టెంబర్ 9న  కూడా కొమరంభీం ఆసీఫాబాద్,మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడా పడే చాన్స్ ఉందన్నారు.