నాగర్కర్నూల్లో దంచికొట్టిన వాన

నాగర్కర్నూల్లో దంచికొట్టిన వాన

నాగర్​ కర్నూల్, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. గురువారం విస్తారంగా వానలు కురిసాయి. జిల్లా కేంద్రంలో గంట వ్యవధిలో 4 సెం.మీల వర్షం కురిసింది. బిజినేపల్లిలో 5 సెం.మీ, తాడూరులో 3.2 సెం.మీ, కల్వకుర్తి, బల్మూరు, లింగాల మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వంగూరులో అత్యధికంగా 6.42 సెం.మీ వర్షపాతం నమోదైంది.

కాలనీలు జలమయం

వనపర్తి: వనపర్తి జిల్లా వ్యాప్తంగా గురువారం కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు  జలమయమయ్యాయి. వనపర్తి–-పెబ్బేరు రోడ్డులో మర్రికుంట అలుగు పారి పెట్రోల్​ బంక్​ ఎదురుగా ఉన్న కల్వర్టు పారుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాజీవ్​ గృహకల్ప, ఎస్సీ, ఎస్టీ హాస్టల్​ ఏరియా, జంగిడిపురం కాలనీ, వెంగళరావునగర్​ కాలనీల్లో వరద నీరు చేరింది. 

రోజంతా ముసురు

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు వాన కురిసింది. గురువారం రోజంతా మబ్బులతో కూడిన వాతావరణం నెలకొంది. జిల్లాలోని కేటిదొడ్డి మండలంలో అత్యధికంగా 70.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.