తెలంగాణలో భారీ వర్షాలు.. 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో భారీ వర్షాలు.. 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

 తెలంగాణలో  వానలు పడుతున్నాయి. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో  రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 13 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్నారు.. జులై 12, 13న పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంతేకాదు ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి.. తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తున్నాయి. అంతేకాదు హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది..

ALSO READ :ఏపీ ప్రజలకు అలర్ట్.. జులై 10న రాత్రికి కుండపోత వర్షం

 తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.  హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలలోపు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.