ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలో రోజంతా ముసురు

ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలో రోజంతా ముసురు

వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌/ నెట్‌‌వర్క్‌‌, వెలుగు : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం రోజంతా ముసురుపట్టింది. సోమవారం ప్రారంభమైన తేలికపాటి జల్లులు మంగళవారం కూడా కొనసాగాయి. ఉదయం నుంచి పలుచోట్ల చిరుజల్లులు, వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో అత్యధికంగా 32.7 మి.మీ వర్షం కురవగా.. పెద్దపల్లి జిల్లా మంథనిలో 29.6మి.మీ, రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌‌లో 24 మి.మీ, గంభీరావుపేటలో 22.6మి.మీ, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌‌లో 22.5మి.మీ, కరీంనగర్‌‌‌‌, సైదాపూర్‌‌‌‌లో 15మి.మీ వర్షం కురిసింది. 

సిరిసిల్ల పాత బస్టాండ్‌‌లోకి నీరు చేరి బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొద్దిరోజులుగా వానలు లేకపోవడంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతుండగా.. తాజా జల్లులతో స్పీడందుకోనున్నాయి.