భారీగా వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

భారీగా వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

గత 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఇక అత్యంత ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెంలోని సీతారాం పట్టణంలో 23.9 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. కరీంనగర్ జిల్లాలోని పోచంపల్లిలో 16.16 సెంటీమీటర్ల అతి భారీ వర్షం నమోదవగా... మెహబూబాబాద్ లోని గూడూరులో 14.8 సెంటీమీటర్లు, జయశంకర్ భూపాలపల్లిలోని మహదేవపూర్ లో 14.6, అదే జయశంకర్ భూపాలపల్లిలోని సర్వాయిపేటలో 14.5, జగిత్యాల్లోని కథలాపూర్ లో 14.3, జయశంకర్ భూపాలపల్లిలోని పెద్దంపేటలో 14.2, భద్రాద్రి కొత్తగూడెంలోని లక్ష్మీదేవి పల్లిలో 13.3, జగిత్యాల్లోని మళ్లీయల్లో 13.3, జగిత్యాల్లోని థైరా మల్లాపూర్ లో 13.2 , జయశంకర్ భూపాలపల్లిలోని కాటారంలో 13.1, పెద్దపల్లిలోని రామగుండంలో 12.2, జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరంలో 12.1, అదే జయశంకర్ భూపాలపల్లిలోని కొయ్యూరులో 12.1, జగిత్యాలలోని పొందూరులో11.9, నిజామాబాద్ లోని కోటగిరిలో 11.9 సెంటీమీటర్లు అతి భారీ వర్షాలు నమోదయ్యాయి.

జగిత్యాల లోని జగ్గాసాగర్ లో 11.1, ములుగులో మాగ్నాపేట్లో 10.9, మంచిర్యాలలోని వెన్నెల్లో 10.8, జగిత్యాల్లోని గోవిందరామ్ లో 10.7 సెంటీమీటర్ల భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కాకుండా రాజేంద్రనగర్ ఏరియాలో భారీ వర్షం నమోదయింది. ఇంద్రా నగర్ లో 9.2 సెంటీమీటర్ల భారీ వర్షం కురవగా, రాజేంద్రనగర్ లోని శివరాంపల్లిలో ఏడు సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. 

హైదరాబాద్ లోనూ... 

కార్వాన్ లోని గోల్కొండ ఏరియాలో ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మోస్తారు వర్షం నమోదవుగా... రాజేంద్రనగర్లోని నియర్ ఏక్తా కాలనీ వద్ద 5.3, రాజేంద్రనగర్ లోని సబ్ స్టేషన్ వద్ద 5.2, రాజేంద్రనగర్ లోని జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ వద్ద 4.7, ఫలక్ నామాలోని కిషన్ బాగ్ గవర్నమెంట్ హై స్కూల్ వద్ద మూడో సెంటీమీటర్లు, చంద్రన్నగుట్టలోని ఇందిరా నగర్ లో రెండ ఎనిమిది, రాజేంద్రనగర్ లోని ఆర్డీఓ ఆఫీస్ వద్ద 2.7, ఫలక్ నామాలోని చందూలాల్ భారతరిలో 2.5, చందానగర్ లో గచ్చిబౌలి ఏరియాలో రెండు పాయింట్ ఐదు, చంద్రం గుట్టలోని కందికల్ గేట్ వద్ద రెండు పాయింటు నాలుగు, రామచంద్రపురం పటాన్ చెరువు ఏరియాలో డీయు ఆఫీస్ డిసైడ్ సబ్ స్టేషన్ వద్ద రెండు పాయింట్ మూడు, ఎల్బీనగర్ ఏరియాలోని సౌత్ హస్తినాపురం ఏరియాలో 2.3 ,చార్మినార్ ఏరియాలో బండి అడ్డ వద్ద 2.3, శేర్లింగంపల్లి చందానగర్ మలక్ పేట్, ఎల్బీనగర్ ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి.