వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఏపీ నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా స్వామి వారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది.
భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. వేసవి కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీసర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆలయంలోని లడ్డూ ప్రసాద కేంద్రాన్ని ఈఓ రమాదేవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాదం తయారీ విధానం, బరువు, క్వాలిటీని పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా చూడాలని ఆఫీసర్లను ఆదేశించారు.
