హిమపాతంతో కశ్మీర్ ప్రజల తీవ్ర ఇబ్బందులు

 హిమపాతంతో కశ్మీర్ ప్రజల తీవ్ర ఇబ్బందులు

జమ్ము కశ్మీర్ లో దట్టమైన మంచు కురుస్తోంది. భారీ హిమపాతంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. రోడ్డుపై రెండు అడుగుల మేరకు మంచు పేరుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ హిమపాతం కారణంగా విమానాలు, రైల్వేలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాతావరణం అనుకూలించకపోవడం..విపరీతంగా మంచు కురవడంతో శ్రీనగర్ కు వచ్చే ఆరు విమానాలను రద్దు చేశారు అధికారులు. అంతేకాదు అన్ని విమాన సంస్థల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డుపై పేరుకుపోయిన మంచును యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

ఇటుక బట్టీలో కోటి రూపాయల డైమండ్

సినీ ఇండస్ట్రీలో మరో మరణం