
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇసుక తుఫాన్ లా గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హకీ పోటీల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజ్, టెంట్లు,కుర్చీలు కుప్పకూలాయి. గాలికి కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా ఇసుక తుఫాన్ లాంటి గాలి దుమారం భాయాందోళనకు గురి చేసింది.
దీంతో క్రీడాకారులు గాలి దుమారంలో చిక్కుకున్నారు. గాలి దుమారం నుంచి బయట పడటానికి క్రీడకారులు పరుగులు తీశారు. ముఖానికి దస్తీ కట్టుకుని గాలి దుమారం నుంచి బయటపడ్డారు ఎంపీ నగేష్. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మరో వైపు తెలంగాణకు నైరుతి రుతుపవనాల కారణంగా రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. జూన్ 10,11న సూర్యపేట, ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం,హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి,మెదక్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల,నారాయణపేట,వనపర్తి, మహబూబ్ నగర్, భువనగిరి, కామారెడ్డి, మెదక్,సిద్దిపేట జిల్లా్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.