భారీగా చలాన్లు ఉన్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాహనానికి నో ఫైన్

భారీగా చలాన్లు ఉన్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాహనానికి నో ఫైన్

రిజిస్ట్రేషన్ లేని వాహనాలు, బ్లాక్ ఫిల్మ్స్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన దానం నాగేందర్ వాహనాన్ని తనిఖీ చేస్తుండగా..టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాహనం అని చెప్పగానే వదిలేశారు పోలీసులు. కారుపై 5వేల రూపాయల చలాన్లు ఉన్నా కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే ట్రాఫిక్ వైలేషన్స్ చేసిన వాహనాలు సీజ్ చేసి దానం నాగేందర్ వెహికల్ మాత్రం వదిలేయడంతో అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.