మేడ్చల్ చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నాతో భారీగా ట్రాఫిక్ జాం

 మేడ్చల్ చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నాతో భారీగా ట్రాఫిక్ జాం

మేడ్చల్ చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నాతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. NH 44 పైనే స్టేజ్ ఏర్పాటు చేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 2 గంటలపాటు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అటు ధర్నాకు వచ్చిన లీడర్ల కార్లు కూడా రోడ్డుపైనే నిలపడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  

మరోవైపు మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి అనుచరులు పెట్టిన ప్లెక్సీలు హాట్ టాఫిక్గా మారాయి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు మద్దతుగా అంటూ ప్లెక్సీల్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నా చేస్తుంటే..అందుకు మల్లారెడ్డి మద్దతు తెలుపుతున్నట్లు ఫ్లెక్సీల్లో రాయించారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే  కొన్ని గంటల తర్వాత ప్లెక్సీల్లో తప్పును గ్రహించిన మంత్రి అనుచరులు వాటిని తొలగించారు. అయినా ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.