కొండల్లో ట్రాఫిక్ జామ్ : యాత్రికుల నరకయాతన

కొండల్లో ట్రాఫిక్ జామ్ : యాత్రికుల నరకయాతన

రోడ్లపై ట్రాఫిక్ జామ్ కామన్. కానీ… హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రఖ్యాత టూరిజం ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు…. కులూమనాలి, చార్ ధామ్ లాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే.. కొండ ప్రాంతాల్లో హైవేలపై జర్నీ చేయాల్సి ఉంటుంది. ఐతే.. ఈ సీజన్లోనే అత్యంత నరకప్రాయమైన ట్రాఫిక్ జామ్ ఇప్పుడు అక్కడ అవుతోంది.

హిమాచల్ ప్రదేశ్ లోని కులూ జిల్లాలో కొండ ప్రాంతాల్లోని అన్ని హైవైలపై ఇపుడు ట్రాఫిక్ డెడ్ లాక్ కనిపిస్తోంది. మనాలి- రోహతంగ్ హైవేపై ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. శనివారం నుంచి మొదలైన ఈ రద్దీ కష్టాలు సోమవారం కూడా కంటిన్యూ అయ్యాయి. కొన్ని గంటల పాటు వాహనాలు కదలకుండా ఆగిపోయాయని యాత్రికులు అంటున్నారు. తమతోపాటు తెచ్చుకున్న ఫుడ్డు, నీళ్లు కూడా అయిపోయాయని.. ఈ కొండ ప్రాంతాల్లో తమకు దిక్కులేకుండా పోయిందని కొందరు యాత్రికులు బాధ పడుతున్నారు.

టాక్సీ డ్రైవర్లదే తప్పు

తొందరగా వెళ్లాలన్న ఆతృతలో టాక్సీ డ్రైవర్లు కొందరు.. ఈ హైవేలపై డ్రైవింగ్ రూల్స్ పట్టించుకోకపోవడం వల్లే ట్రాపిక్ జామ్ అవుతోందంటున్నారు పోలీసులు.

కొన్ని చోట్ల లైన్ తప్పి ముందుకు పోవడం వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలకు  అడ్డుపడి ఎటూ కదలకుండా అయిపోయిన పరిస్థిితి.

మరికొన్ని చోట్ల… కొండలపై అక్కడక్కడా కట్టిన గోడలకు యాక్సిడెంట్ చేయడం వల్ల గోడ కూలి వాహనాలు కదలని పరిస్థితి.

హైవేలపై బ్రిడ్జీలు ఉన్న చోట పరిస్థితి మరీ నరకంగా మారింది. బాటిల్ నెక్ లాంటి ఈ ప్రాంతాల్లో వాహనాలు పద్ధతిగా వెళ్తేనే ట్రాఫిక్ మూవ్ అవుతుంది. లేకపోతే బ్రిడ్జీ బ్లాక్ అయిపోయి… ఎక్కడివక్కడే ఆగిపోతున్నాయి.

అటు ఉత్తరాఖండ్.. చార్ ధామ్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు కూడా తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు.

సైన్యాన్ని సహాయక పనులకోసం ఉపయోగిస్తామని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు చెబుతున్నారు.