వందల కోట్లకు వారసురాలు.. అయినా తొమ్మిదేళ్లకే సన్యాస దీక్ష

వందల కోట్లకు వారసురాలు.. అయినా తొమ్మిదేళ్లకే సన్యాస దీక్ష

సూరత్: ఆడుతూపాడుతూ గడిపే వయసులోనే ఆ చిన్నారి ఆధ్యాత్మికం వైపు అడుగులేసింది. వందల కోట్ల ఆస్తికి వారసురాలైనప్పటికీ అన్నీ వదిలేసి తొమ్మిదేళ్లకే సన్యాసిగా మారింది. చిన్నతనం నుంచే మతాచారాలపై ఆసక్తితో జైన సన్యాస దీక్ష తీసుకుంది. గుజరాత్​లోని సూరత్​కు చెందిన వజ్రాల వ్యాపారి ధనేష్, అమీబెన్ దంపతుల కూతురు దేవాన్షి ఈ దీక్ష తీసుకుంది. బుధవారం సూరత్​లోని వెసు ప్రాంతంలో జైనాచార్య కీర్తియాశ్సూరి సమక్షంలో ఆ చిన్నారి దీక్ష స్వీకరించింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు.