హెలికాప్టర్​ను తరలిస్తూ..బరువు ఎక్కువై వదిలేసిన్రు

హెలికాప్టర్​ను తరలిస్తూ..బరువు ఎక్కువై వదిలేసిన్రు

న్యూఢిల్లీ : దెబ్బతిన్న హెలికాప్టర్​ను మరో చాపర్ తో తరలిస్తుండగా, బరువు ఎక్కువై మధ్యలోనే వదిలేశారు. దీంతో వేలాది అడుగుల పైనుంచి హెలికాప్టర్ కిందపడి ముక్కలైంది. కేదార్​నాథ్​లో ఇటీవల ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ఖరాబైంది. దాన్ని రిపేర్ కోసం గౌచర్ తరలించాలని ఎయిర్ ఫోర్స్​కు చెందిన ఎంఐ17 చాపర్ తెచ్చారు. ఇనుప తాళ్లతో కట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. 

బరువు ఎక్కువ కావడంతో బయల్దేరిన కాసేపటికే ఎంఐ 17 చాపర్​ బ్యాలెన్స్ తప్పింది. దీంతో హెలికాప్టర్​ను వదిలేయగా మందాకిని నదిలో పడి ముక్కలైంది. బరువు ఎక్కువ కావడం వల్ల హెలికాప్టర్​ను తరలించడం కుదరలేదని.. ఎవరూ లేనిచోట పైలెట్ దాన్ని జారవిడిచారని ఎయిర్ ఫోర్స్ తెలిపింది.