రెండుసార్లు గుండె జారి కిందపడ్డా.. పేషెంట్ ను బ్రతికించిన డాక్టర్లు

రెండుసార్లు గుండె జారి కిందపడ్డా.. పేషెంట్ ను బ్రతికించిన డాక్టర్లు

అమెరికాలో అద్భుతం జరిగింది. సౌత్ క్యాలిఫోర్నియాకు చెందిన దంపతుల కుమారుడు గుండెకు సంబంధిత సమస్యతో  మరికొద్దిరోజుల్లో మరణిస్తారని డాక్టర్లు చెప్పారు. దీంతో తనకొడుకును బ్రతికించుకునేందుకు తల్లిదండ్రులు హార్ట్ డోనర్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే లక్కీగా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ డియోగోలో అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి తన  గుండెను దానం చేసినట్లు తెలిసింది. దీంతో  కుటుంబ సభ్యులు సంబంధిత డోనర్ కుటుంబ సభ్యులతో  సంప్రదింపులు జరిపి డాక్టర్ల సాయంతో గుండెను బాక్స్ లో భద్రపరిచారు. దీన్ని హెలిక్యాప్టర్ ద్వారా శాన్ డియోగో నుంచి సౌత్ క్యాలిఫోర్నియాకు చెందిన కెక్ హాస్పిటల్ యూనివర్సిటీకి తరలించారు.

కెక్ ఆస్పత్రి బిల్డింగ్ హెలీఫ్యాడ్ పై హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అదే సమయంలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ ఒక్కసారిగా హెలిఫ్యాడ్ పై కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. కూలిన హెలికాఫ్టర్ లో నుంచి గుండెను భద్రపరిచిన బాక్సును బయటకు తీశారు. అనంతరం ఆ బాక్స్ ను ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళుతున్న సిబ్బంది చేతిలో ఉన్న ఆ బాక్స్ ఒక్కసారిగా కిందపడింది. దీంతో ఆందోళనకు గురైన డాక్టర్లు హడావిడిగా ఆ బాక్సును ఐసీయూలోకి తీసుకెళ్లి విజయవంతంగా ఆపరేషన్  చేసి గుండెను ట్రాన్స్ ఫ్లాంట్ చేశారు.

అయితే ఈ ఘటన ఓ అద్భుతమని డాక్టర్లు సిబ్బందిని కొనియాడారు. హెలికాఫ్టర్ కు ప్రమాదం జరిగినా.. చేతిలో నుంచి బాక్స్ కిందపడినా ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు.