కంగనాపై హేమమాలిని సెటైర్ 

కంగనాపై హేమమాలిని సెటైర్ 

వచ్చే ఎన్నికల్లో యూపీ రాష్ట్రంలో మధుర లోక్ సభ నుంచి నటి కంగనా రనౌత్ పోటీ చేస్తారనే ఊహాగానాలపై తాజాగా బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ, హేమమాలిని స్పందించారు. కంగానా ఇక్కడి నుంచి పోటీ చేస్తారా అనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు బాగుంది..బాగుంది అంటూ ఆమె రియాక్టయ్యారు. 

మధురకు సినిమా తారలు మాత్రమే కావాలా అని హేమమాలి అన్నారు. రేపు రాఖీ సావంత్ కూడా పోటీకి రెడీ అవుతారని ఆమె సెటైర్ వేశారు. ఇవాళ సిట్టింగ్ ఎంపీగా హేమమాలి మధుర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు.