Good Health : హిమోఫిలియా అంటే ఏంటీ.. వ్యాధి లక్షణాలు ఏంటీ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా..?

Good Health : హిమోఫిలియా అంటే ఏంటీ.. వ్యాధి లక్షణాలు ఏంటీ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా..?

శరీరంపై ఏ చిన్న గాయమైనా రక్తం బయటకు వస్తుంది. అయితే ఆ రక్తస్రావం కొద్దిసేపట్లోనే ఆగిపోతుంది. కానీ, ఆగకుండా రక్తం కారిపోతూనే ఉంటే ఆ మనిషి పరిస్థితి ఏమిటి? గంటల తరబడి అలా రక్తస్రావం జరిగితే రక్తహీనత ఏర్పడి ప్రాణానికే ముప్పు రావచ్చు. అలాంటి పరిస్థితినే 'హిమోఫిలియా' అంటారు.హిమోఫిలియా అనే వ్యాధి... జన్యు లోపం వల్ల ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కండరాలు, కీళ్లు, మెదడు మొదలైన చోట్ల రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోతున్న వాళ్లూ ఉన్నారు. ఇంత ప్రమాదకరమైన వ్యాధి గురించి అవగాహన. జనాల్లో ఎక్కువగా లేదు. అందుకే 'వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా ( WFH )  అనే అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ 2017 నుంచీ ప్రతి ఏడాది ఏప్రిల్ 17వ 'వరల్డ్ 'హిమోఫిలియా డే'గా నిర్వహిస్తోంది. తద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది.

'డబ్ల్యూఎఫ్ హెచ్' ఏం చేస్తుంది.?

గత యాభై ఏళ్లుగా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా' అనే సంస్థ స్వచ్ఛందంగా హిమోఫిలియా బాధితులకు సేవలందిస్తోంది. ప్రపంచంలోని మొత్తం 140 దేశాల్లో ఈ సంస్థ పని చేస్తోంది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) ద్వారా అధికారిక గుర్తింపు కూడా ఉంది. ఈ సంస్థ మన దేశంలో 60 సొసైటీలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది. హిమోఫిలియా సొసైటీ హైదరాబాద్' పేరుతో ఈ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రధానంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఖరీదైన మందులను తక్కువ ధరకు అందిస్తోంది. హిమోఫిలియాతో బాధపడే ప్రతీ ఒక్కరికీ సాయం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ నడుస్తోంది. ఈ వ్యాధి ఒక్కటే కాదు... రక్తస్రావానికి సంబంధించిన అన్ని వ్యాధులపై కృషి చేస్తోంది.

హిమోఫిలియా అంటే?

హీమోపిబియా అనేది రక్తసంబంధిత జన్యులోప వ్యాధి రక్తంలో సహజంగా ఉండాల్సిన రక్తస్రావ వ్యవస్థలో ఉండే ఫ్యాక్టర్ 7, 8, 9లో ఏదో ఒకటి లోపించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఫ్యాక్టర్ లోపాలను బట్టి దాన్ని మైల్స్, మోడరేట్, సినియర్ అని మూడు భాగాలుగా విభజిస్తారు.

చికిత్స చాలా ఖరీదు..!

హీమోఫిలియాను నయం చేసే మందును. 'యాంటీ హిమోఫిలియా ఫ్యాక్టర్' అంటారు. ఈ మందు మన దేశంలో అందుబాటులో
లేదు. ఇతర దేశాల నుంచి ఈ మందును దిగుమతి చేసుకోవాలి. పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేని విధంగా వీటి ధరలు ఉంటాయి. వ్యాధి తీవ్రతను బట్టి రూ.10వేల నుంచి రూ.7లక్షల వరకు ఖర్చవుతుందని నిపుణులు చెప్తున్నారు.. ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు దీన్ని తక్కువ వరకు బాధితులకు అందజేస్తున్నాయి.

వ్యాధి లక్షణాలు: 

శరీరంలోని గాయాలు, ఆపరేషన్ జరిగిన చోట నుంచి నిరంతరం రక్తస్రావం కావడం. గాయాలు మానకపోవడం, కీళ్లలో వాపు, కీళ్ల నొప్పి, ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారడం.మల, మూత్రాలలో రక్తస్రావం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

హెపటైటిస్-ఎ, బికి చికిత్స తీసుకోవాలి.ఆస్పిరిన్, బ్రూఫిన్ వంటి మందులు వాడకం తగ్గించాలి.గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి. మెడికల్ ట్రేస్లెట్ ధరించడం ఉత్తమలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆ వ్యాధి బాధితులు రక్తస్రావంతో ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా తమ పరిస్థితిని గురించి ఇతరులతో చెప్పలేనప్పుడు ఈ బ్రేస్లెట్ సూచికగా పనిరేస్తుంది. దాన్ని చూసి వాళ్లను అస్పత్రికి తరలించగలరు. అలాగే డాక్టర్లు వాళ్లకి ప్రత్యేకంగా ఫ్యాక్టర్ ట్రీట్ మెంట్ ఇస్తారు. వ్యాధిగ్రస్తులు తమ వ్యాధి గురించి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేయాలి.