
బ్యాచిలర్స్కి వంట చేయడమంటేనే పెద్ద టాస్క్ లాంటిది. అందుకే ఉదయం లేవగానే వంట పాత్రలతో యుద్ధం చేస్తుంటారు. కానీ.. కొన్ని కిచెన్ గాడ్జెట్స్ వాడితే వంటచేయడం పెద్ద పనేమీ కాదు. తక్కువ టైంలో సింపుల్‌గా వండుకుని తినేయొచ్చు. అందుకే ఈ వారం ఈజీ కుకింగ్కు ఉపయోగపడే కొన్ని గాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం..
స్టీమర్
కరోనా ప్యాండెమిక్ వచ్చినప్పటి నుంచి జనాల్లో హెల్త్ కాన్షియస్ పెరిగింది. అందుకే చాలామంది వేపుళ్లు, ఎక్కువ ఆయిల్ వేసి చేసిన వంటకాలకు బదులు ఆవిరితో ఉడికించిన ఫుడ్ తింటున్నారు. అలా ఆవిరితో వండుకోవడానికి ఇలాంటి స్టీమర్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. గుడ్లు, మొక్కజొన్న పొత్తులు, పచ్చి వేరుశనగలు లాంటివి ఉడికించడానికి, రాత్రి మిగిలిపోయిన రైస్‌ని వేడి చేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది.
ధర: క్వాలిటీ, సైజును బట్టి 1,500 రూపాయల నుంచి మొదలు
కర్రీ కుక్కర్
బ్యాచిలర్స్కి రైస్ వండడం పెద్ద కష్టమేమీ కాదు. బియ్యం కడిగి కుక్కర్లో పెట్టేసి, స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. వచ్చిన తిప్పలన్నీ కర్రీతోనే. అందుకే గీక్ కంపెనీ ‘రొబోకుక్’ అనే కర్రీ వండే కుక్కర్‌ని మార్కెట్లోకి తీసుకుకొచ్చింది. ఇందులో రైస్‌తో పాటు పప్పు, కర్రీ, గ్రేవీ, పులావ్, బిర్యానీ, ఫిష్, చికెన్, కిచిడి వండుకోవడానికి ప్రత్యేకంగా మోడ్స్ ఉంటాయి. ఏది వండాలన్నా కావాల్సినవి అందులో వేసి ఆ మోడ్ బటన్ నొక్కాలి. నిమిషాల్లో ఫుడ్ రెడీ అవుతుంది. అంతేకాదు.. ‘కీప్ వార్మ్’ మోడ్‌లో పెడితే ఫుడ్ చాలాసేపు వేడిగా ఉంటుంది. దీని కెపాసిటీ ఐదు లీటర్లుస్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు. ఇలాంటి ఫీచర్లతో చాలా కంపెనీలు కుక్కర్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.
ధర: 6,459 రూపాయలు
ఎలక్ట్రిక్ తందూర్
వీకెండ్ వస్తే బయటికి వెళ్లే వాళ్ల కంటే ఇంట్లోనే పార్టీలు చేసుకునేవాళ్ల సంఖ్య బాగా పెరిగింది. కానీ.. చికెన్ తందూర్, కబాబ్, గ్రిల్ చికెన్ లాంటివి లేకుండా పార్టీ ఎలా అంటారా? అందుకే ఇంట్లో కూడా ఇలాంటివి చేసుకోవడానికి కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ తందూర్ మేకర్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. మీట్‌కి మసాలాలు పట్టించి, ఈ మెషిన్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే నిమిషాల్లో తందూర్ రెడీ అవుతుంది. వీటితో పిజ్జా, శాండ్విచ్ కూడా చేసుకోవచ్చు. ధర: 2,500 రూపాయల నుంచి మొదలు.. క్వాలిటీ, సైజు, ఫీచర్లను బట్టి ధరల్లో తేడాలుంటాయి.
డీఫ్రాస్ట్ ప్లేట్
ఇదివరకటితో పోలిస్తే.. మన దగ్గర ఇప్పుడు ఫ్రోజెన్ ఫుడ్ వాడకం కాస్త పెరిగింది. ముఖ్యంగా బ్యాచిలర్స్.. ప్రతిసారి మార్కెట్‌కు వెళ్లి నాన్‌వెజ్ కొనే బదులు ఒకేసారి ఎక్కువగా తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటుంటారు. గడ్డ కట్టుకుపోయిన మాంసం ముక్కలను డీ ఫ్రాస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఈ డీఫ్రాస్ట్ ప్లేట్స్ వాడితే సరిపోతుంది. ఇవి ఫ్రోజెన్ మీట్‌ని చాలా తక్కువ టైంలో డీఫ్రాస్ట్ చేస్తాయి. ఫ్రిడ్జ్ నుంచి తీసి, 30 నిమిషాల నుంచి గంటసేపు ఈ ప్లేట్ మీద పెట్టి వండుకోవచ్చు. మామూలుగా చికెన్ బ్రెస్ట్ డీఫ్రాస్ట్ కావడానికి రెండు గంటలు పడుతుంది. ఈ ప్లేట్ మీద పెడితే 30 నిమిషాల్లో డీఫ్రాస్ట్ అయిపోతుంది.
ధర: క్వాలిటీని బట్టి 1,000 రూపాయల నుంచి మొదలు