V6 News

మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు: మంత్రి వివేక్

మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు: మంత్రి వివేక్

మంచిర్యాల: మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం (ఏప్రిల్ 14) చెన్నూరు మున్సిపాలిటీలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్‎తో కలిసి మంత్రి వివేక్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల సాధికారత కోసం కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాల కోసం అనేక సంక్షేమ పథకాలు  అమలు చేస్తోందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.