కోల్‌కతాతో జరుగుతోన్న మ్యాచులో చెన్నై బ్యాటర్స్ దుమ్మురేపుతున్నారు. ఫస్ట్ టెన్‌లో రెండు వికెట్ల నష్టానికి 102 పరుగుల భారీ స్కోర్ చేశారు. సీఎస్కే కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్ (7) మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 38 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుత క్రీజులో సంజు శాంసన్ (40), డేవాల్డ్ బ్రేవిస్ (13) ఉన్నారు. కేకేఆర్ బౌలర్లలో అంకుల్ రాయ్, వైభవ్ ఆరోరా చెరో వికెట్ తీశారు.

