పెట్స్​ని గుర్తించే స్ప్రింకర్స్​​

పెట్స్​ని గుర్తించే స్ప్రింకర్స్​​

పొలంలో మొక్కలు పెంచడం ఎంత కష్టమో ఇంట్లో పెంచడం అంతకంటే కష్టం. ఎందుకంటే.. ఇంట్లో సరైన సూర్యరశ్మి, సరిపడా నీళ్లు అందుతున్నాయా? లేదా? అనేది ఎప్పటికప్పుడు చూస్తుండాలి. మొక్కల కోసం ప్రత్యేకంగా కేర్​ తీసుకోవాలి. అయితే.. గార్డెనింగ్​ కోసం తీసుకొచ్చిన కొన్ని గాడ్జెట్స్​ వాడితే కాస్త పని తగ్గించుకోవచ్చు.అలాంటి గాడ్జెట్స్​ కొన్ని.. 

మల్టీఫంక్షనల్ సాయిల్ టెస్టర్

గార్డెన్​లో మొక్కలు బాగుండాలి. మట్టి బాగుండాలి. అందులో సరిపడా తేమ ఉండాలి. అది తెలుసుకోవడం ఎలా? అందుకే ఈ మల్టీ ఫంక్షనల్ సాయిల్ టెస్టర్​ని సూపరెమో కంపెనీ మార్కెట్​లోకి తెచ్చింది. ఇది నేలలోని తేమ, పీహెచ్​, టెంపరేచర్​తోపాటు సూర్యరశ్మిని కూడా కొలుస్తుంది. దీనికి చీకటిలో కూడా కనిపించే డిజిటల్ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. టెస్టర్​కు ఉండే ప్రోబ్​ని భూమిలో నాటగానే  డిస్​ప్లేపై వివరాలు చూపిస్తుంది. ఇందులో 9V బ్యాటరీ వేయాలి. ఇండోర్, అవుట్‌‌డోర్ ఎక్కడైనా పనిచేస్తుంది. కుండీల్లో పెట్టిన మొక్కలకే కాదు.. పొలాల్లో కూడా దీన్ని వాడొచ్చు.  

ధర: 888 రూపాయలు

 

పెట్​ రెపెల్లెంట్​ స్ర్పింక్లర్​

గార్డెన్​లో స్ర్పింక్లర్ ఆన్​ చేసి వేరే పనిలో పడతారు చాలామంది. కానీ... ఆ టైంలో పెంపుడు జంతువులు ఆ స్ర్పింక్లర్​ వైపు వెళ్తే ప్రమాదం. పెట్స్​ మాత్రమే కాదు.. గార్డెన్​లో అటూఇటూ​ తిరిగే ఉడుతలు, పక్షులు, ఎలుకలు అటువైపు వెళ్లినా తడిసి ముద్దవుతాయి. అందుకే ఇంటి గార్డెన్​లో వాడేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన పెట్​ రెపెల్లెంట్​ స్ర్పింక్లర్​ని బిగించుకోవాలి. బ్లాక్​ ప్లస్​ డెకోర్​ కంపెనీ తీసుకొచ్చిన ఈ జెట్ స్ప్రేయర్ వాటర్​ ప్రెజర్​ దగ్గరకు జంతువులు రాగానే ఆటోమెటిక్​గా ఆగిపోతుంది. జింకలు, కుందేళ్ళు, ఉడుతలు, ఉడుములు, పక్షులు, ఎలుగుబంట్లు, పిల్లులు, కుక్కలు, ఎలుకలు ఇలా అన్నింటినీ ఇది గుర్తిస్తుంది. పైగా స్ప్రింక్లర్ సౌండ్​ చేస్తూ... వాటర్​ని షూట్​ చేస్తుంది. కాబట్టి జంతువులు అటువైపు వెళ్లవు. ఇందులో 30-అడుగుల వరకు పనిచేసే మోషన్ డిటెక్షన్- సెన్సర్ ఉంది.  ధర: 9,675 రూపాయలు

 

 

పాలినేటర్​ 

కొన్నాళ్ల నుంచి తేనెటీగలు, కీటకాల సంఖ్య బాగా తగ్గిపోతోందని రీసెర్చ్​ల్లో వెల్లడైంది. పైగా మొక్కలపై పెస్టిసైడ్స్ ఎక్కువగా  స్ర్పే చేయడం వల్ల మొక్కల్లో పాలినేషన్​ బాగా తగ్గిపోతోంది. అందుకే పాలినేషన్​ కోసం ప్రత్యేకంగా ఒక డివైజ్​ వచ్చింది. దీన్ని ఏరో గార్డెన్​ అనే కంపెనీ తయారుచేసింది. టొమాటో, దోసకాయ, పుచ్చకాయ... ఇలా ప్రతి మొక్కకు దీనితో పాలినేషన్​ చేయొచ్చు. ముఖ్యంగా ఇంటి గార్డెన్​లో పండే పంటలకు ఇది బెస్ట్‌‌ గాడ్జెట్​. ఎందుకంటే.. సిటీల్లో ఇండ్లలోకి తేనెటీగలు లాంటివి రావడం చాలా కష్టం. కిడ్స్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ సైజులో ఉండే ఈ పాలినేటర్​ చాలా ఉపయోగపడుతుంది.                                                             ధర: 3,477 రూపాయలు

 

స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్‌‌

కొన్ని రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు అందరూ ఆలోచించేది గార్డెన్​లో మొక్కల గురించే. పెట్స్​ అయితే.. కేర్​ సెంటర్లలో వదిలి వెళ్లొచ్చు. కానీ.. మొక్కల్ని మనమే చూసుకోవాలి. అందుకే ఆలాంటి టైంలో మొక్కల బాగోగులు చూసేందుకు పినోలెక్స్​ అనే కంపెనీ వైర్‌‌లెస్ స్మార్ట్ వాటర్ టైమర్ వైఫై హబ్‌‌ని మార్కెట్‌‌లోకి తెచ్చింది. ఈ హబ్‌‌ని వైఫైతో కనెక్ట్ చేయాలి. తర్వాత హబ్​కి​ వాటర్​, స్ర్పింక్లర్​ పైపులను కనెక్ట్‌‌ చేయాలి. ఈ డివైజ్​కు సంబంధించిన యాప్​ని యూజర్​ మాన్యువల్‌‌లో ఉండే క్యూఆర్​ కోడ్‌‌ను స్కాన్ చేసి ఇన్​స్టాల్​ చేసుకోవాలి. ఆ యాప్​ సాయంతో డివైజ్​ని మొబైల్​తో కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్​ నుంచే మొక్కల ఇరిగేషన్​ని కంట్రోల్​ చేయొచ్చు. అంతేకాదు.. అలారం సెట్​ చేసినట్టు మొక్కకు నీళ్లు ఎప్పుడు పెట్టాలి అనేది కూడా సెట్​ చేసుకోవచ్చు. పైగా ఇందులో స్ప్రింక్లర్, స్ప్రేయర్ రెండు మోడ్స్​ ఉంటాయి. సీజన్‌‌ని బట్టి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఎనిమిది ప్రత్యేక స్ప్రింక్లర్ ప్రోగ్రామ్‌‌లను కాన్ఫిగర్ చేయొచ్చు. ధర: 4,999 రూపాయలు