ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే బచ్చలమల్లి

ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే బచ్చలమల్లి

అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా  సుబ్బు దర్శకత్వంలో రూపొందుతోన్న  చిత్రం ‘బచ్చలమల్లి’. హాస్య మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది. గురువారం టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. నరేష్ పాత్రను పరిచయం చేస్తూ సాగిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మొండిపట్టుదల, మూర్ఖత్వం ఉన్న  వ్యక్తిగా మాస్ పాత్రలో నరేష్ కనిపించిన తీరు  హైలైట్‌‌‌‌గా ఉంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో  నరేష్ మాట్లాడుతూ ‘నేను నటించిన  గమ్యం, నాందిలా ఇది కూడా  ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే సినిమా అవుతుంది. అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పాడు. టీజర్ రెస్పాన్స్ చూసి సినిమా బిగ్ హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ వచ్చిందని అమృత చెప్పింది. సుబ్బు మాట్లాడుతూ ‘మా అమ్మ చనిపోయినప్పుడు  లైఫ్‌‌‌‌లో వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని తప్పు చేయకూడదు  అనిపించింది.

ఇలాంటి పాయింట్ మీద ఒక కథ చెప్పాలనిపించింది. ప్రతి ఒక్కరూ ఏదో మూమెంట్‌‌‌‌లో తప్పు చేస్తారు. అలాంటి ఒక పాయింట్‌‌‌‌ని జెన్యూన్‌‌‌‌గా చూపిస్తున్నాం’ అని చెప్పాడు. ‘ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడుతున్నాం రాసి పెట్టుకోండి’ అని నిర్మాతలు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.